చంద్రబాబు రాకుంటే అరెస్ట్ చేసి తెస్తాం: నాందేడ్ ఎస్పీ కతార్
- ఐదు సంవత్సరాల క్రితమే చార్జ్ షీట్ దాఖలు
- ఆ ప్రతులను నిందితులకు పంపించాం
- నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ కోర్టు పరిధిలోని అంశం
- విచారణకు రాకుంటే అరెస్ట్ తప్పదన్న ఎస్పీ
వారిని ఎప్పుడు విచారణకు పిలవాలన్న విషయం కోర్టు చూసుకుంటుందని, వారు రాకుంటే, కోర్టు నుంచి ఆదేశాలు అందిన తరువాత తాము అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెడతామని చెప్పారు. చంద్రబాబు సహా 16 మంది నిందితులను 21వ తేదీలోపు కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్ కోర్టు నుంచి తమకు ఆదేశాలు అందాయని, ఆలోగా నిందితులు వచ్చి హాజరవుతారనే భావిస్తున్నామని తెలిపారు. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వడం కోర్టు విచక్షణాధికారమని చెప్పిన ఆయన, చంద్రబాబు సహా ఇతర నిందితులు కోర్టుకు రాకుంటే, న్యాయ నిపుణుల సలహా తీసుకుని, వారిని అరెస్ట్ చేసి తరలిస్తామని చెప్పారు.