చెన్నూరు టికెట్ వ్యవహారం.. ఆత్మహత్యాయత్నం చేసిన గట్టయ్య ఆరోగ్యం విషమం!
- యశోదా ఆసుపత్రిలో చికిత్స
- మరో ఐదుగురి పరిస్థితి తీవ్రం
- నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన గట్టయ్య
బాల్కసుమన్ కు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు అనుచరుడు గట్టయ్య ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో మరో 16 మందికి మంటలు అంటుకున్నాయి. అయితే వీరిలో గట్టయ్య సహా ఆరుగురి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత బాధితులను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో పోలీసులే చొరవ తీసుకుని వీరిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వీరిని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు పరామర్శించారు.