నటి శ్రీదేవికి అరుదైన గౌరవం.. స్విట్జర్లాండ్ లో విగ్రహం ఏర్పాటు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నటి శ్రీదేవికి అరుదైన గౌరవం.. స్విట్జర్లాండ్ లో విగ్రహం ఏర్పాటు!

  • స్విట్జర్లాండ్ కేంద్రంగా పలు సినిమాల్లో నటించిన శ్రీదేవి
  • ఆమెను గౌరవిస్తూ విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం
  • ప్రముఖ దర్శకుడు యశ్ చోప్రాకు ఇప్పటికే స్థానం
బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ హీరోయిన్ ఎవరంటే ఠక్కున గుర్తు వచ్చే పేరు శ్రీదేవి. తెలుగు, తమిళం సహా పలు భాషల్లో వందలాది సినిమాల్లో నటించిన శ్రీదేవికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తాజాగా శ్రీదేవికి అరుదైన గౌరవం దక్కనుంది. తమ దేశంలో శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. తమ దేశంలో తెరకెక్కిన పలు చిత్రాల్లో శ్రీదేవి నటించారని స్విట్జర్లాండ్ అధికారులు తెలిపారు.

  శ్రీదేవి నటించిన పలు సినిమాల షూటింగులు తమ దేశంలో జరిగాయని, తద్వారా స్విట్జర్లాండ్ పర్యాటకం అభివృద్ధి చెందేందుకు కారకులయ్యారని వ్యాఖ్యానించారు. శ్రీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. చాలా సినిమాలను స్విట్జర్లాండ్ కేంద్రంగా తెరకెక్కించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు యశ్ చోప్రా విగ్రహాన్ని స్విస్ ప్రభుత్వం 2016లో అక్కడ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో దుబాయ్ లోని ఓ హోటల్ లోని బాత్ టబ్ లో ప్రమాదవశాత్తూ పడిపోయి శ్రీదేవి చనిపోయారు.
switzerland
sridevi
dead
dubai
government
Bollywood

More Telugu News