జోరు పెంచిన టీఆర్ఎస్.. కేకే నివాసంలో సమావేశం నిర్వహించిన కేటీఆర్!

  • జోరు పెంచిన టీఆర్ఎస్ నేతలు
  • కేకే నివాసంలో తాజా పరిణామాలపై కేటీఆర్ సమావేశం
  • హాజరైన పలువురు నేతలు
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ జోరు పెంచింది. ఓ వైపు ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకుంటూనే, మరోవైపు ఎన్నికల ప్రచార కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేకే నివాసంలో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాజా పరిణామాలపై పలువురు నేతలతో ఆయన చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ రెడ్డి, రవీంద్ర కుమార్, జీవన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్ లు హాజరయ్యారు. 
Go Back to Shorts
k kesava rao
TRS
KTR
meeting

More Telugu News