అక్టోబర్ లో ‘జయహో బీసీ’ సదస్సు: ఏపీ సీఎం చంద్రబాబు

05-09-2018 Wed 18:46 | Andhra
  • అమరావతిలో టీడీపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్
  • అక్టోబర్ నాలుగో వారంలో ఈ సదస్సు నిర్వహిస్తాం
  • టీడీపీకి తొలి నుంచి బీసీలే అండదండలు
టీడీపీ ఆధ్వర్యంలో అక్టోబర్ లో ‘జయహో బీసీ’ సదస్సు నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిలో టీడీపీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘జయహో బీసీ’ సదస్సుని ‘దేశంలో సగం - తెలుగుదేశంలో మనం’ అనే ఉపశీర్షికతో నిర్వహించనున్నామని, విజయదశమి తర్వాత అక్టోబర్ నాలుగో వారంలో ఈ సదస్సు ఉంటుందని చెప్పారు.

టీడీపీకి తొలి నుంచి బీసీలే అండదండలుగా ఉన్నారని, బీసీల రుణం తీర్చుకోవడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించనున్నామని అన్నారు. ‘మహానాడు’ తరహాలో రెండు రోజుల పాటు ఈ సదస్సు నిర్వహిస్తామని, తొలిరోజు అన్ని బీసీ కులాల వారితో సమావేశాలు నిర్వహిస్తామని, రెండో రోజు భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. వచ్చే పదిహేనేళ్లలోనే రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని, ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ గల రాష్ట్రంగా ఏపీ అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తొలుత ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ చిత్ర పటాలకు చంద్రబాబు, పార్టీ నేతలు నివాళులర్పించారు. హరికృష్ణ మృతిపై సంతాప తీర్మానాన్ని కళావెంకట్రావు ప్రవేశపెట్టారు.

టీడీపీ కొత్త కార్యాలయం త్రీడీ నమూనా విడుదల

టీడీపీ కొత్త కార్యాలయం త్రీడీ నమూనాను చంద్రబాబు విడుదల చేశారు. రెండు లక్షల చ.అ. విస్తీర్ణంలో దీనిని నిర్మించనున్నామని, 3 బ్లాకులుగా ఈ కొత్త కార్యాలయ నిర్మాణం ఉంటుందని, నవంబర్ నెలాఖరు లోపు భవన నిర్మాణం పూర్తవుతుందని చంద్రబాబు చెప్పారు. డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కంటే 5 రెట్లు పెద్దదిగా ఈ కొత్త కార్యాలయ నిర్మాణం ఉంటుందని అన్నారు.
Chandrababujayaho bc

More Telugu News

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27

సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు

24-10-2026 Sat 17:19
..more