మీ పిల్లలను వైసీపీకి దూరంగా ఉంచండి: ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్

04-09-2018 Tue 19:43 | Andhra
  • గుంటూరు సభ భగ్నం చేసేందుకు వైసీపీ కుట్ర పన్నింది
  • నేర చరిత గల యువకులను సభకు పంపారు  
  • ఏదైనా ఘర్షణ జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారు?
అరాచక రాజకీయాలు చేస్తున్న వైసీపీ కార్యాకలాపాల నుంచి తమ పిల్లలను దూరంగా ఉండేటట్లు చూడాలని తల్లిదండ్రులకు ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.డి.హిదాయత్ విజ్ఞప్తి చేశారు. ముస్లింల సంక్షేమానికి టీడీపీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, అందుకే ‘నారా హమారా...టీడీపీ హమారా’ కార్యక్రమాన్నిముస్లిం సమాజం విజయవంతం చేసిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఏపీ సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల గుంటూరులో నిర్వహించిన ‘నారా హమారా...టీడీపీ హమారా’ కార్యక్రమం విజయవంతమైందని, రాష్ట్రంలోని ముస్లిం సమాజమంతా ఏకతాటిపై నిలబడి, టీడీపీ వెనకే ఉందనే విషయం ఈ సభ ద్వారా రుజువైందని చెప్పారు.

వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి


ముస్లింల నుంచి వచ్చిన స్పందన చూసి, వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ముస్లింలను ఓటు బ్యాంకుగా వైసీపీ చూసిందని ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.డి.హిదాయత్ మండిపడ్డారు. గుంటూరు సభను భగ్నం చేయడానికి వైసీపీ కుట్ర పన్నిందని, నేర చరిత్ర కలిగిన 8 మంది నంద్యాల యువకులను సభకు పంపించారని, చంద్రబాబు మాట్లాడే సమయంలో నినాదాలు చేసి, సభను అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు.

లక్ష మందికి పైగా హాజరైన టీడీపీ కార్యకర్తలు ఎంతో సమన్వయంతో వ్యవహరించి, వారిని అక్కడి నుంచి పంపించి వేశారని, అక్కడ ఏమైనా ఘర్షణ జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. గతంలో తునిలో కాపుల సభ జరుపుకుంటున్నప్పుడు, వైసీపీ కార్యకర్తలే రైలును తగులబెట్టారని ఎం.డి.హిదాయత్ ఆరోపించారు.

నాడు వైఎస్ కూడా ఇలాగే వ్యవహరించారు


జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాగే వ్యవహరించే వారని, హైదరాబాద్ లో మతకలహాలు సృష్టించిన చరిత్ర ఆయనదని, వైసీపీ అరాచక రాజకీయాలకు పాల్పడుతోందని హిదాయత్ ఆరోపించారు. ఆ పార్టీ కార్యకలాపాలకు, సభకు తమ పిల్లలను దూరంగా పెట్టాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ‘నారా హమారా...టీడీపీ హమారా’ సభలో వైసీపీ కార్యకర్తలు చేసిన నినాదాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని జగన్ ని ఆయన ప్రశ్నించారు.

 గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేకు అవకాశమిచ్చేవాళ్లం

ముస్లిం యువతను బలిపశువు చేయడానికి వైసీసీ నేతలు కుట్ర పన్నుతున్నారని, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేగా ముస్లిం సామాజిక వర్గానికే చెందిన వారే ఉన్నారని, ఆయనే నేరుగా గుంటూరు సభకు వచ్చి మాట్లాడాలని అనుకుంటే తాము వీఐపీ పాస్ ఇచ్చే వారమని అన్నారు. వైసీసీ నేతలు నేరుగా వచ్చి సీఎం చంద్రబాబునాయుడుని ప్రశ్నిస్తామంటే అవకాశమిచ్చేవారమని, అసెంబ్లీ, పార్లమెంట్ నుంచి పారిపోయిన వారికి సభలో మాట్లాడే దమ్ము ఎక్కడుందని ఎద్దేవా చేశారు.  
YSRCPhidayat

More Telugu News

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27

సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు

24-10-2026 Sat 17:19
..more