నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి, ప్రమాదానికి గురైతే.. బీమా వర్తించదు!: సుప్రీంకోర్టు

04-09-2018 Tue 17:01 | National
  • అతి వేగం, నిర్లక్ష్యంగా వాహనం నడిపితే బీమా వర్తించదు
  • పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ కింద పరిహారం మాత్రమే అందుతుంది
  • స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
నిర్లక్ష్యంగానో, వేగంగానో వాహనాన్ని నడిపి ప్రమాదానికి గురైతే బీమా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ రకంగా ప్రమాదానికి గురైన వారు ఇన్స్యూరెన్స్ కు క్లెయిమ్ చేసుకోవద్దని తెలిపింది. అయితే, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి మాత్రం 'పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ' కింద పరిహారం అందుతుందని జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అబ్దుల్ నజీర్ లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.

దిలీప్ భౌమిక్ అనే వ్యక్తి 2012 మే 20న రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు బీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, స్వయం తప్పిదం వల్లే ఆయన ప్రమాదానికి గురయ్యాడని బీమా కంపెనీ క్లయింను తిరస్కరించింది. దీంతో వ్యవహారం కోర్టుకి వెళ్లింది. మృతుడి కుటుంబసభ్యులకు రూ. 10.57 లక్షల బీమా చెల్లించాలని త్రిపుర హైకోర్టు ఆదేశించింది. దీంతో సదరు కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తోసి పుచ్చింది.

మృతుడు నిర్లక్ష్యంగా వాహనం నడిపారని... స్వయం తప్పిదం కారణంగా ప్రమాదం జరిగితే బీమా చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీం తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 166 ప్రకారం బాధిత కుటుంబసభ్యులు బీమా కోరవద్దని చెప్పింది. ఇదే సమయంలో పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కింద భౌమిక్ కుటుంబానికి రూ. 2 లక్షల బీమా ఇవ్వాలని ఆదేశించింది.   
insurencedeathdrivingsupreme court

More Telugu News

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27

సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు

24-10-2026 Sat 17:19
..more