చాలా సినిమాలు డబ్బులు తీసుకోకుండా చేశాను: నటుడు శివకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చాలా సినిమాలు డబ్బులు తీసుకోకుండా చేశాను: నటుడు శివకృష్ణ

  • డబ్బున్నవాడిననే గర్వం లేదు 
  • చిన్న సినిమాలే ఎక్కువగా చేశాను
  • తక్కువ సినిమాలు చేయడానికి కారణమదే     
విప్లవ భావాలు కలిగిన పాత్రలను ఎక్కువగా పోషించిన శివకృష్ణ, ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తన అనుభవాలను ఆవిష్కరించారు. "నటుడిగా 40 వసంతాలు పూర్తి చేశాను .. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కనీసం ఓ 300 సినిమాలు చేయాలి .. కానీ నేను 100 సినిమాలపైగా మాత్రమే చేశాను.

ఎందుకంటే, నాకు నచ్చకపోతే నేను చేయను .. డబ్బుకోసం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. డబ్బుకి నేను అంతగా ప్రాధాన్యతను ఇవ్వలేదు కూడా. డబ్బున్న కుటుంబం నుంచి వచ్చాననే గర్వం కూడా అందుకు కారణం కాదు. అదే వుంటే చిన్న సినిమాలు చేసేవాడిని కాదు .. కానీ నేను చేసింది ఎక్కువగా చిన్న సినిమాలే. చాలా సినిమాలకి డబ్బులు తీసుకోకుండా చేశాను తెలుసా? సినిమా అంటే వున్న ఇష్టం కారణంగా .. ఆ సినిమాను నమ్ముకున్న వాళ్లకి మంచి జరగాలనే ఉద్దేశంతోనే అలా చేశాను" అని చెప్పుకొచ్చారు.   
shivakrishna
ali

More Telugu News