జాకెట్లలో బంగారం దాచి, ఎంబ్రాయిడరీ కలరింగ్... అడ్డంగా బుక్కయ్యాడు!
- ఆగని బంగారం అక్రమ రవాణా
- అరకిలో బంగారాన్ని ముక్కలు చేసి తెచ్చిన అయూబ్
- చెన్నై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసిన అధికారులు
స్త్రీలు ధరించే జాకెట్ లో బంగారాన్ని చిన్న చిన్న ముక్కలుగా, దాచి, దానిపై ఎంబ్రాయిడరీ చేయించి తీసుకొచ్చాడు. తొలుత తనిఖీల్లో అతన్ని బయటకు పంపిన అధికారులు, ఏదో అనుమానంతో మరోసారి తనిఖీలకు రావాలని పిలువగా, అయూబ్ వాదనకు దిగాడు. తనిఖీలకు వెళ్లేందుకు నిరాకరించిన ఆయన, తాను తనిఖీలు ముగించుకుని వచ్చానని వాదులాడాడు. అతన్ని మరోసారి సోదా చేయగా, జాకెట్లలో దాచిన బంగారం బయటపడింది.
దాదాపు అర కిలో బంగారాన్ని 11 ముక్కలుగా చేసి జాకెట్లలో చొప్పించాడని, దీని విలువ రూ. 15 లక్షలు ఉంటుందని చెప్పిన అధికారులు అయుబ్ తో పాటు, అతనికి స్వాగతం పలికేందుకు వచ్చిన ముస్తఫానూ అరెస్ట్ చేశారు.