హైదరాబాద్ నిజాం మ్యూజియంలో ఘరానా చోరీ.. కోట్ల విలువ చేసే వజ్రాలు పొదిగిన బంగారు వస్తువుల అపహరణ!
- వెంటిలేటర్ నుంచి తాడు సాయంతో లోపలికి
- వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్, కప్పు సాసర్ సెట్ చోరీ
- మ్యూజియం గురించి తెలిసిన వారి పనేనని అనుమానం
రోజూలానే సోమవారం మ్యూజియాన్ని తెరిచిన సిబ్బంది దొంగతనం విషయాన్ని గుర్తించారు. వజ్రాలు పొదిగిన దాదాపు మూడు కేజీల బరువైన బంగారు టిఫిన్ బాక్స్, వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగిన బంగారు టీకప్పు.. సాసర్.. స్పూన్ చోరీకి గురయ్యాయి. వీటి విలువ కోట్లలో ఉంటుందని మ్యూజియం అధికారులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది తెలిసిన వారి పనే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మ్యూజియం, అలారం పనిచేసే విధానం గురించి తెలిసినవారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.