గుంటూరులో మద్యం మత్తులో హెడ్ కానిస్టేబుల్ వీరంగం.. మహిళపై చెప్పుతో దాడి!

03-09-2018 Mon 15:54 | Andhra
  • పై అధికారులకు తెలియకుండానే మహిళలను తీసుకొచ్చినకానిస్టేబుల్
  • విచారణకు ఆదేశించిన అధికారులు
  • కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ
గుంటూరులో పూటుగా మద్యం తాగిన ఓ హెడ్ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. విచారణ పేరుతో కొందరు మహిళలను స్టేషన్ కు తీసుకొచ్చి చెప్పుతో కొట్టాడు. ఆదివారం రాత్రి 11 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గుంటూరులోని కొండా వెంకటప్పయ్య కాలనీకి చెందిన కొందరు మహిళలను ఆదివారం హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు విచారణ కోసం స్టేషన్ కు తీసుకొచ్చాడు. రాత్రి పూటుగా మద్యం తాగి మళ్లీ స్టేషన్ కు చేరుకున్న అతను.. అక్కడున్న ఓ మహిళపై చెప్పుతో దాడిచేశాడు. ఈ సందర్భంగా అక్కడున్న కొందరు ఫొటో తీసి ఇంటర్నెట్ లో పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. తన పై అధికారులకు తెలియకుండానే వెంకటేశ్వరరావు సదరు మహిళలను స్టేషన్ కు తీసుకొచ్చినట్లు తెలిసింది. ఈ ఘటన జరిగిన సమయంలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు మద్యం మత్తులో ఉన్నాడనీ, విచారణ పూర్తయ్యాక అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 
Guntur DistrictPolicechappalattack

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more