ప్రియురాలి కోసం విజయవాడ నుంచి బ్యాచ్ తో వచ్చిన యువకుడు... బంజారాహిల్స్ లో వీరంగం!

03-09-2018 Mon 09:39 | Both States
  • బీటెక్ చదివేరోజుల్లో యువతితో ప్రేమ
  • మరొకరికి సన్నిహితంగా ఉంటోందని గొడవకు వచ్చిన యువకుడు
  • ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
తనను ప్రేమించి, ఇప్పుడు మరొకరితో సన్నిహితంగా ఉంటోందని ఆరోపిస్తూ, విజయవాడ నుంచి తన స్నేహితులను వెంటేసుకుని వచ్చిన ఓ యువకుడు, హైదరాబాద్, బంజారాహిల్స్ లో వీరంగం సృష్టించగా, పోలీసులు అందరినీ అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, విజయవాడ, మాచవరంకు చెందిన రేవంత్ (26), బీటెక్ చదువుతున్నప్పుడు, గుంటూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె (25)తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. అయితే, రేవంత్ మరో మహిళకు దగ్గరయ్యాడన్న విషయం తెలుసుకున్న యువతి, అతన్ని వదిలించుకుని హైదరాబాద్ కు వచ్చి, బంజారాహిల్స్ లో కన్సల్టెంట్ గా పనిచేస్తున్న అఖిల్ అనే యువకుడితో ఉంటోంది.

తాను ప్రేమించిన అమ్మాయి మరొకరికి దగ్గరైందన్న ఆగ్రహంతో ఉన్న రేవంత్, గత కొన్ని రోజులుగా, ఆమెతో ఫోన్ లో మాట్లాడుతూ, బెదిరిస్తున్నాడు. ఆమెను విజయవాడ పంపాలని అఖిల్ నూ హెచ్చరించాడు. ఈ క్రమంలో నిన్న తెల్లవారుజామున 10 మంది స్నేహితులను వెంటేసుకుని విజయవాడ నుంచి వచ్చిన రేవంత్, అఖిల్ తో గొడవపడ్డాడు. అఖిల్ స్నేహితులు కూడా రావడంతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, రేవంత్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. తాను ఐఈఎల్టీఎస్ కు ప్రిపేర్ అయ్యేందుకు హైదరాబాద్ లో ఉంటున్నానని చెబుతూ, సదరు యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్టు తెలిపారు. 
HyderabadLoverBanjarahillsPoliceArrest

More Telugu News

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27

సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు

24-10-2026 Sat 17:19
..more