ప్రియురాలి పెళ్లి చెడగొట్టానన్న మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య!

03-09-2018 Mon 08:57 | Both States
  • ఆదివారం నాడు యువతికి జరగాల్సిన వివాహం
  • వరుడి వద్దకు వెళ్లి ఆమెను ప్రేమించినట్టు చెప్పిన రమేష్
  • ఆమె మంచిదంటూ సూసైడ్ లేఖ 
తాను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహమైపోతోందన్న అక్కసుతో, పెళ్లిని చెడగొట్టిన ఓ యువకుడు, ఆపై మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖపట్నం పరిధిలోని గాజువాకలో కలకలం రేపింది. మృతుని జేబులో లభించిన ఆత్మహత్య లేఖలో పేర్కొన్న వివరాలను పోలీసులు వెల్లడించారు.

 చిన్నతనంలోనే తండ్రి మరణించగా, తల్లి, అన్న, ఇద్దరు అక్కలతో కలసి నివసిస్తున్న రమేష్ అనే యువకుడు, పెయింటింగ్ పనుల్లో ఉన్నాడు. రమేష్, ఓ యువతిని ప్రేమిస్తుండగా, ఆమెకు ఆదివారం నాడు రఘు అనే యువకుడితో వివాహం జరగాల్సివుంది. తన ప్రియురాలికి పెళ్లవుతుందన్న బాధలో ఉన్న రమేష్, రఘు వద్దకు వెళ్లి, తన ప్రేమ గురించి చెప్పాడు. దీంతో రఘు ఆ పెళ్లిని రద్దు చేసుకోగా, రమేష్ పై యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు రమేష్ ను విచారించి, పూచీకత్తుపై ఇంటికి పంపగా, దువ్వాడ రైల్వేస్టేషన్ సమీపంలో రమేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ అమ్మాయి చాలా మంచిదని, తప్పు తనదేనని తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. తనది వన్ సైడ్ లవ్ మాత్రమేనని, ఆమెను దక్కించుకోవాలన్న ఉద్దేశంతో నిందలు వేశానని తెలిపాడు. రఘు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆ లేఖలో రమేష్ కోరాడు. కాగా, ఇతని ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
VizagSucideLoverPolice

More Telugu News

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59

బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన

24-10-2026 Sat 17:51

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24-10-2026 Sat 17:41

ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!

24-10-2026 Sat 17:27

సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు

24-10-2026 Sat 17:19
..more