జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆనం

  • విశాఖ జిల్లా పాదయాత్రలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరిక
  • రామనారాయణరెడ్డిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్
  • మారనున్న నెల్లూరు జిల్లా వైసీపీ సమీకరణాలు
మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ అధినేత జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. విశాఖపట్టణం జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్... ఆనంకు పార్టీ కండువా కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఆనం చేరికతో నెల్లూరు జిల్లా వైసీపీలో సమీకరణాలు మారనున్నాయి. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది.

దివంగత ఆనం వివేకానందరెడ్డితో కలసి రామనారాయణరెడ్డి రెండేళ్ల క్రితం టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. రామనారాయణరెడ్డిని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా చంద్రబాబు నియమించారు. అయితే, టీడీపీలో తనకు తగినంత గుర్తింపు దక్కడం లేదనే భావనతో గత కొంత కాలంగా ఆ పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారు. చివరికి ఈరోజు వైసీపీలో చేరారు.
Go Back to Shorts
anam ramnarayana reddy
ysrcp
jagan
join

More Telugu News