హమ్మయ్య.. 'మహాసేన్' తో ముప్పులేదట
రాష్ట్రంపై తుపాను ప్రభావం ఉండబోదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి ఈ ఉదయం తుపానుగా మారింది. ఈ తుపానుకు 'మహాసేన్' అని నామకరణం చేశారు. ప్రస్తుతం 'మహాసేన్' చెన్నైకి ఆగ్నేయంగా 1300 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది ఉత్తర దిశగా పయనం సాగించి బంగ్లాదేశ్, మయన్మార్ మధ్య తీరం దాటుతుందని అధికారులు తెలిపారు. అనూహ్యంగా దిశ మార్చుకుంటే తప్ప, రాష్ట్రానికి ముప్పేమీలేదని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది.