తెలంగాణ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ప్రత్యేక సెలవుల ప్రకటన!

  • ఇకపై ఏడాదికి 5 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు
  • సంబంధిత ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం
  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు శుభవార్త. ఇకపై వీరికి ఏడాదికి 5 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులను ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేయడంతో ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా, ఇప్పటికే మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించింది.

గర్భిణిగా ఉన్న సమయంలో 180 రోజులు సెలవులు తీసుకోవచ్చు. 8వ నెల నుంచి ఎప్పుడైనా ఈ సెలవులు ఉపయోగించుకోవచ్చు. పర్మినెంట్ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇస్తారు. ఈ సెలవులను డ్యూటీగానే పరిగణించి సర్వీస్ ను కొనసాగిస్తారు. అయితే, తొలి రెండు కాన్పులకు మాత్రమే ప్రసూతి సెలవులకు అనుమతి ఇస్తారు. ఒకవేళ ఒకటి, రెండు కాన్పుల్లో పుట్టిన పిల్లలు మృతి చెందితే కనుక మూడో కాన్పులో సెలవులకు అవకాశం ఇస్తారు.
Go Back to Shorts
Telangana
women
employees

More Telugu News