ida bollaram: ఐడీఏ బొల్లారంలో దారుణం.. విద్యార్థిని గొంతు కోసిన ప్రేమోన్మాది!

  • వినాయకనగర్ లో సంఘటన
  • పదో తరగతి విద్యార్థి నిఖిత
  • తనను ప్రేమించాలంటూ వెంటబడుతున్న అరవింద్
సంగారెడ్డి జిల్లాలోని ఐడీఏ బొల్లారంలోని వినాయకనగర్ లో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది తనను ప్రేమించలేదంటూ ఓ విద్యార్థిని గొంతు కోసేశాడు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం, విద్యార్థిని నిఖిత పదో తరగతి చదువుతోంది. ప్రేమోన్మాది అరవింద్ తనను ప్రేమించాలంటూ కొంత కాలంగా ఆమె వెంట పడుతున్నట్టు చెప్పారు. కాగా, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
ida bollaram
student
murder

More Telugu News