hari krishna: నన్ను ‘అన్నయ్యా’ అని హరిక‌ృష్ణ నోరారా పిలిచేవాడు: కంటతడిపెట్టిన కృష్ణంరాజు

నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి సీనియర్ నటుడు కృష్ణంరాజు నివాళులర్పించారు. మెహిదీపట్నంలోని నివాసంలో హరికృష్ణ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. హరికృష్ణతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కంటతడిపెట్టారు. హరిక‌ృష్ణ తనను ‘అన్నయ్యా’ అని పిలిచేవాడని, ఆయన తనకు సొంత తమ్ముడి కంటే ఎక్కువ అని అన్నారు. ఏదైనా కష్టపడి సంపాదించుకోవాలనే మనస్తత్వం అతనిదని, సున్నిత మనస్తత్వం కలిగిన హరికృష్ణ మరణం తనకు చెప్పలేని బాధ కలిగిస్తోందని కృష్ణంరాజు కన్నీటి పర్యంతమయ్యారు.
hari krishna
krishnam raju

More Telugu News