హరికృష్ణ మృతికి అసలు కారణం... పోలీసుల ఎఫ్ఐఆర్ వివరాలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హరికృష్ణ మృతికి అసలు కారణం... పోలీసుల ఎఫ్ఐఆర్ వివరాలు!

  • ప్రమాదానికి కారణం సీటు బెల్ట్ పెట్టుకోకపోవడమే
  • కారులోని మిగతావారు బెల్ట్ పెట్టుకున్నందునే బతికారు
  • పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి
అత్యంత వేగంగా కారులో ప్రయాణిస్తున్న వేళ, సీటు బెల్టు పెట్టుకోకపోవడమే హరికృష్ణ మరణానికి కారణమైందని కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కారు ప్రమాదానికి గురైన వేళ, ఆయన ఎగిరి రోడ్డుపై పడ్డారని, ఆ కారణంతోనే మెదడుకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావంతో మరణించారని పోలీసులు ప్రాథమిక రిపోర్టులో పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకుని ఉంటే, ఆయన బయటకు విసిరివేయబడివుండేవారు కాదని, కారులోని మిగతావారి మాదిరే ప్రాణాలతో బయటపడివుండేవారని చెబుతున్నారు.కాగా, హరికృష్ణ తన కారులో అరికపూడి వెంకటరావు, శివాజీలతో కలసి వెళుతున్న వేళ ప్రమాదం జరిగింది. హరికృష్ణ డ్రైవింగ్ చేస్తుండగా, శివాజీ, వెంకట్రావులు సీటు బెల్టులు పెట్టుకున్నారు. హరికృష్ణ మాత్రం బెల్ట్ పెట్టుకోలేదు. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో, రోడ్డుపై ఉన్న రాయిని తప్పించబోయి, డివైడర్ ను బలంగా ఢీ కొట్టిన కారు, పల్టీలు కొడుతూ, ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొంది.
Road Accident
Harikrishna
Seat Belt
Died
Police

More Telugu News