విజయ్ దేవరకొండ డేట్ల కోసం పోటీ పడుతోన్న నిర్మాతలు

'అర్జున్ రెడ్డి' తో ఒక రేంజ్ హిట్ ను అందుకున్న విజయ్ దేవరకొండ, 'గీత గోవిందం' సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేశాడు. ఈ సినిమా వసూళ్లు ఆయనను పెద్ద స్టార్ రేంజ్ లో నిలిపాయి. ప్రస్తుతం ఆయన చేతిలో ఓ మూడు ప్రాజెక్టుల వరకూ వున్నాయి.

ఆ తరువాత సినిమాలు తమ బ్యానర్లో చేసి పెట్టమని చాలామంది నిర్మాతలు విజయ్ దేవరకొండ చుట్టూ తిరుగుతున్నారట. మరికొందరు విజయ్ సన్నిహితుల ద్వారా బేరసారాలు జరుపుతున్నారని సమాచారం. యువ కథానాయకులలో ఒక్క నాని మినహా మిగతావాళ్లు ఎవరూ కూడా 5 కోట్ల పారితోషికం దాటలేదు. కానీ విజయ్ దేవరకొండకి మాత్రం 8 నుంచి 10 కోట్ల వరకూ ఇవ్వడానికి కొంతమంది నిర్మాతలు సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 


More Telugu News