ప్రైవేటు వైద్యుడి నిర్వాకంతో నాలుక పోగొట్టుకున్న యువకుడు!
- కేన్సర్ ఉన్నా లేనట్టు రిపోర్టు
- నాలుకను తొలగించిన బసవతారకం వైద్యులు
- ప్రైవేటు ఆసుపత్రి ఎదుట బాధిత బంధువుల ఆందోళన
మందులు వాడుతున్నా నాలుకపై పుండ్లు తగ్గకపోవడంతో శ్రీనివాస్ ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకున్నాడు. అక్కడి వైద్యులు పరీక్షించి శ్రీనివాస్‌కు కేన్సర్ ఉన్నట్టు తేల్చారు. అక్కడి వైద్యుల సలహా మేరకు శ్రీనివాస్ హైదరాబాద్ వచ్చి బసవతారకం ఆసుపత్రి వైద్యులను కలిశాడు. అతడిని పరీక్షించిన వైద్యులు కేన్సర్ నాలుక మొత్తానికి వ్యాపించిందని, తొలగించకుంటే ప్రాణానికే ప్రమాదమని చెప్పి తొలగించారు.
శ్రీనివాస్ నాలుక పోవడానికి మహబూబాబాద్‌లోని ప్రైవేటు వైద్యుడే కారణమని ఆరోపిస్తూ సోమవారం అతడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. అతడిపై చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలంటూ ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నా విరమించాలని కోరారు. అందుకు వారు ససేమిరా అనడంతో ఫిర్యాదు చేస్తే వైద్యుడిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు.