Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బ్యూటీషియన్ పద్మ ముఖంపై కత్తితో 'ఎస్' అని చెక్కిన అక్షరం... మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!

  • భర్తను వీడి యువకుడితో పద్మ సహజీవనం
  • ఆమెపై పక్కా ప్రణాళికతో హత్యాయత్నం
  • నూతన్ కుమార్ పట్టుబడితే నిజం తెలుస్తుందంటున్న పోలీసులు
భర్తతో విభేదాలు వచ్చి, మరో యువకుడితో సహజీవనం చేస్తున్న బ్యూటీషియన్ పద్మ కేసులో, ఆమెను కట్టేసి, కత్తితో దారుణంగా దాడి చేసిన తరువాత, ఆమె నుదుటిపై 'ఎస్' అన్న అక్షరాన్ని చెక్కడం చూస్తుంటే, నిందితుడు అత్యంత కిరాతకంగా దాడికి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. కృష్ణా జిల్లా బావులపాడులో పద్మపై హత్యాయత్నానికి ముందు, ఆమె అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కిన నిందితుడు, కాళ్లూ, చేతులూ కట్టేసి, బట్టలు ఊడదీసి, చేతులు నరికిన సంగతి తెలిసిందే. ఆమె నుదుటిపై ఉన్న 'ఎస్' అక్షరం వెనకున్న మిస్టరీని ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు.

పద్మ భర్త పేరు సూర్య నారాయణ కావడంతో, పోలీసుల విచారణను పక్కదారి పట్టించేందుకే నిందితుడు 'ఎస్' అక్షరాన్ని చెక్కాడని భావిస్తున్న పోలీసులు, పద్మతో సహజీవనం చేస్తున్న నూతన్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నూతన్ ను అదుపులోకి తీసుకుంటే, ఈ కేసు వెనకున్న మిస్టరీ వీడిపోతుందని చెబుతున్నారు. కాగా, నూతన్ ను వివాహం చేసుకోవాలని పద్మ భావిస్తోందని, అందువల్ల భర్తకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుందని చెబుతున్న పోలీసులు, ఘటనా స్థలిలో వేలిముద్రలను సేకరించామని, ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని, పక్కా ప్లాన్ ప్రకారమే హత్యాయత్నం జరిగిందని అన్నారు.
Beautisian
Padma
Murder attempt
Police

More Telugu News