Karnataka: ‘ఎంత కావాలన్నా తినండి.. ఎంతో కొంత ఇవ్వండి’ అంటున్న హోటల్ యజమాని!

కర్ణాటకలోని శివమొగ్గలో ఉన్న ఓ హోటల్ వద్దకు జనం ఎగబడుతున్నారు. క్యూ లైన్లలో నిలబడి మరీ తమ వంతు వచ్చేవరకూ వేచిచూస్తున్నారు. అయితే ఇక్కడ ఉచితంగా భోజనం ఏమీ పెట్టడం లేదు. ‘ఎంత కావాలంటే అంత తినండి.. మీకు నచ్చినంత ఇచ్చి వెళ్లండి’ అని మాత్రం ఆ హోటల్ యజమాని చెబుతున్నారు. దీంతో ప్రజలు భారీఎత్తున హోటల్ కు చేరుకుంటున్నారు.

శివమొగ్గలోని తీర్థహలిలో ఉన్న శ్రీ అన్నలక్ష్మీ రెస్టారెంట్ కు జనాల తాకిడి విపరీతంగా పెరిగింది. ఏదో పేరు కోసం భోజనం అన్నట్లు కాకుండా ఈ హోటల్ రుచికరమైన కూరలు, పెరుగును అందిస్తోంది. ఈ విషయమై హోటల్ మేనేజర్ గోవర్ధన్ మాట్లాడుతూ.. తాను చాలా ఏళ్లుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని తెలిపారు. తక్కువ ధరలో ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్న లక్ష్యంతోనే ఈ హోటల్ ను ప్రారంభించామని చెప్పారు.

ఎంత కావాలంటే అంత తిని.. ఇష్టం ఉన్నంత నగదు ఇవ్వాల్సిందిగా తాము కోరామని పేర్కొన్నారు. అయితే ఇలా తిన్నవారిలో చాలామంది బిల్లులు చెల్లించకుండా వెళ్లిపోయారనీ, కొందరు మాత్రం తాము తిన్నదానికంటే ఎక్కువ మొత్తం ఇచ్చి వెళ్లారని గోవర్థన్ తెలిపారు. రోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి  2.30 గంటల వరకూ తమ హోటల్ లో భోజనం అందిస్తామని చెబుతున్నారు.
Karnataka
sivamogga
hotel
eat whatever

More Telugu News