Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ ఫొటోలను పోస్టు చేసిన కాంగ్రెస్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. హోరెత్తుతున్న ట్విట్టర్!

  • జర్మనీలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ
  • ఫొటోలు పోస్టు చేసిన కాంగ్రెస్ 
  • కడుపుబ్బా నవ్వుకుంటున్న నెటిజన్లు
‘రాహుల్ గాంధీ వైవిధ్య భరిత హావభావాలు’ అంటూ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఫొటోలు రాహుల్ గాంధీకి తలనొప్పిగా మారాయి. ఈ ఫొటోలపై నెటిజన్లు విసురుతున్న ఛలోక్తులు, చేస్తున్న కామెంట్లతో ట్విట్టర్ హోరెత్తుతోంది.

కాంగ్రెస్ చీఫ్ ప్రస్తుతం జర్మనీలో పర్యటిస్తున్నారు. ఆ దేశ పార్లమెంటును రాహుల్ సందర్శించారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫొటోలను కాంగ్రెస్ ట్విట్టర్‌లో పోస్టు చేసి వాటికి ‘రాహుల్  వైవిధ్య భరిత హావభావాలు’ అని క్యాప్షన్ తగిలించింది. ఈ ఫొటోల్లో రాహుల్ సీరియస్‌గా కిందికి, పైకి, పక్కకి చూస్తూ పోజిచ్చారు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.  

దేశం గురించి మీ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? అన్న ప్రజల ప్రశ్నకు రాహుల్ రియాక్షన్ ఇదీ.. అంటూ కొందరు కామెంట్ చేయగా, కాంగ్రెస్ పార్టీ తనను తానే ట్రోల్ చేసుకుంటోంది అని మరికొందరు కామెంట్ చేశారు. ‘వైవా పరీక్షల్లో నా పరిస్థితీ ఇదే’ అని మరొకరు పేర్కొన్నారు. మనసారా నవ్వించినందుకు రాహుల్‌కు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నానని ఒకరంటే, ప్రపంచంలో ఎక్కడున్నా రాహుల్ నవ్విస్తూనే ఉంటారని మరొకరు కామెంట్ చేశారు. 'రాహుల్‌ను తన సొంత సోషల్ మీడియానే దెబ్బతీసేలా ఉంది' అని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు.
Rahul Gandhi
Congress
Twitter
Germany
AICC
India

More Telugu News