100 నదుల్లో వాజ్పేయి చితాభస్మ నిమజ్జనం.. కలశాలు అందజేసిన ప్రధాని!
- గంగానదితో సహా వందనదుల్లో వాజ్పేయి అస్థికల నిమజ్జనం
- ఆస్థి కలశాలను వివిధ రాష్ట్రాల అధ్యక్షులకు ఇచ్చిన మోదీ
- ఆస్థి కలశ యాత్ర నిర్వహించి నిమజ్జనం చెయ్యనున్న బీజేపీ శ్రేణులు
గంగా నది సహా.. మొత్తం 11 రాష్ట్రాల్లోని వంద నదుల్లో వాజ్ పేయి చితాభస్మం కలుపుతారు. మధ్యప్రదేశ్ లోని నర్మద, చంబల్, పార్వతి, క్షిప్రా, తపతి, రెవా, బెట్వా, పెంచ్, సింధ్, కేన్ నదుల్లో కలిపేందుకు షెడ్యూల్ సిద్ధం చేశారు. తెలంగాణలోని కృష్ణా , తుంగభద్ర, గోదావరి, మూసీ నదుల్లో నాలుగుచోట్ల వాజ్పేయి చితాభస్మాన్ని కలపనున్నారు.