నీ దగ్గరకు వచ్చేస్తానురా అంది అమ్మ.. ఇంతకంటే బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ ఉంటుందా?: చిరంజీవి
- మా ఇంటిని రేన్నోవేషన్ చేయించాం
- వారం, పది రోజుల కిందే అమ్మ నా వద్దకు వచ్చారు
- ఒంటరిగా ఉండాలని అమ్మ అడిగినప్పుడు.. ఆమె నిర్ణయాన్ని గౌరవించాం
ఇదే విషయాన్ని ఓ మీడియా సంస్థతో ఆయన పంచుకున్నారు. ఈ నెల 22న చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా అమ్మతో కలసి, చిరంజీవి సదరు మీడియాతో మాట్లాడారు. వారం, పది రోజుల కిందే అమ్మ తన వద్దకు వచ్చిందని ఆయన తెలిపారు. మేం ఉంటున్న ఇంటిని కొంచెం రెన్నోవేషన్ చేయిస్తున్నందున... దీంతో అమ్మ ఒంటరిగా వేరే ఇంట్లో ఉంటోందని చెప్పారు.
ఈ మధ్య అమ్మ తనతో మాట్లాడుతూ, 'ఒంటరిగా ఉండాలంటే దిగులుగా ఉంటోందిరా. నీ దగ్గరకు వచ్చేస్తా' అని చెప్పగానే తనకు ఎంతో ఆనందం కలిగిందని చెప్పారు. ఒంటరిగా ఉండాలని అమ్మ కోరుకున్నప్పుడు... ఆమె నిర్ణయాన్ని గౌరవించామని... ఇప్పుడు తానే 'వచ్చేస్తాను రా' అని చెబితే అంతకంటే ఆనందం ఏముంటుందని అన్నారు. ఇంతకంటే బెస్ట్ బర్త్ డే గిఫ్ట్ తనకు ఏముంటుందని చెప్పారు.