'సైరా'లో ముఖ్యమైన పాత్రలో పూనమ్ కౌర్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సైరా'లో ముఖ్యమైన పాత్రలో పూనమ్ కౌర్?

  •  'స్వర్ణ ఖడ్గం'లో కీలకపాత్ర 
  • 'శ్రీనివాస కళ్యాణం'లోను మెరిసింది
  • 'సైరా'కోసం జరిగిన ఆడిషన్
చారిత్రక నేపథ్యం కలిగిన కథాకథనాలతో 'సైరా' రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేసే ఆలోచన ఉండటం వలన, ఆయా భాషలకి చెందిన నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. తాజాగా ఒక ముఖ్యమైన పాత్ర కోసం పూనమ్ కౌర్ ను తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఆడిషన్ కూడా పూర్తయిందని చెబుతున్నారు.

ఇప్పుడున్న కథానాయికలలో ఎవరికీ తీసిపోనంత గ్లామరస్ గా పూనమ్ కౌర్ ఉంటుంది. కానీ కొన్ని కారణాల వలన .. కొంతకాలంగా ఆమెకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఆమెకు అవకాశాలు దక్కుతున్నాయి. 'స్వర్ణ ఖడ్గం' ధారావాహికలో చేస్తోన్న ఆమె 'శ్రీనివాస కళ్యాణం'లోను కనిపించింది. 'సైరా'లోను ఆమె కనిపించనుండటం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆమె ఎంపిక విషయంలోనూ .. పాత్ర విషయంలోను త్వరలోనే స్పష్టత రానుంది. 
poonam kaur

More Telugu News