పూర్తిస్థాయిలో సిల్క్ స్మిత జీవితచరిత్ర .. రంగంలోకి 'కబాలి' దర్శకుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పూర్తిస్థాయిలో సిల్క్ స్మిత జీవితచరిత్ర .. రంగంలోకి 'కబాలి' దర్శకుడు

  • స్మిత బయోపిక్ గా వచ్చిన 'ది డర్టీ పిక్చర్'
  • ప్రతి ప్రాంతంలోనూ కాసుల వర్షం 
  • పూర్తిస్థాయి వివరాలతో రంగంలోకి 'కబాలి' దర్శకుడు
తెలుగు తెరపై సందడి చేసిన శృంగార తారలలో సిల్క్ స్మిత ఒకరు. అప్పట్లో కుర్రాళ్లంతా ఆమెను మత్తుకళ్ల సుందరిగా పిలుచుకునేవారు. తెలుగు .. తమిళ భాషల్లో కీలకమైన పాత్రల ద్వారా .. ప్రత్యేకమైన గీతాల ద్వారా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. కొన్ని కథలు ఆమె పాత్ర చుట్టూనే తిరిగాయంటే అప్పట్లో ఆమెకి గల క్రేజ్ ను అర్థం చేసుకోవచ్చు. అలాంటి సిల్క్ స్మిత జీవిత చరిత్రగా 'ది డర్టీ పిక్చర్ ' వచ్చింది.

ఈ సినిమా సూపర్ హిట్ అయింది కానీ .. ఇందులో సిల్క్ స్మిత జీవితాన్ని పలు కోణాల్లో ఆవిష్కరించలేదనే విమర్శలు వినిపించాయి. అందువలన సిల్క్ స్మిత జీవితాన్ని పూర్తిస్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పా రంజిత్ రెడీ అవుతున్నాడు. 'కబాలి' .. 'కాలా' సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఆయన, సిల్క్ స్మిత జీవితాన్ని వెబ్ సిరీస్ గా రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆమె బాల్యం నుంచి చనిపోయేవరకూ గల అంశాలకి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో ఆయన వున్నాడని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ కి ఆయనే దర్శక నిర్మాతగా వ్యవహరించనున్నాడట.  
silk smita

More Telugu News