బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తడబాటు.. నేలకొరిగిన జాతీయ జెండా!
- నేలపై పడిపోయిన జాతీయ పతాకం
- అనంతరం మరోవైపుకు తిరిగి సెల్యూట్ చేసిన బీజేపీ చీఫ్
- మండిపడుతున్న నెటిజన్లు
జెండా నేలపై పడిపోవడంతో అప్పటివరకూ మాట్లాడుతున్న డీడీ న్యూస్ యాంకర్లు సైలెంట్ అయిపోయారు. షా కార్యక్రమం డిజాస్టర్ గా మారిందని యాంకర్లు గొణిగారు. కాగా, ఈ ఘటనపై సోషల్ మీడియాలో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. తనను ఆవిష్కరించే అర్హత అమిత్ షాకు లేకపోవడంతోనే జాతీయ జెండా నేలకొరిగిందని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, దేశాన్ని బీజేపీ ఏ గతి పట్టించిందో తెలుసుకోవడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచిందని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకొకరు దీని వెనకాల కూడా నెహ్రూ కుట్ర ఉందని చెప్పండి అని ఎద్దేవా చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.