చిక్కుల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. నిందితులుగా సీఎం, డిప్యూటీ సీఎం!
- ఐఏఎస్ అధికారి అన్షు ప్రకాశ్‌పై దాడి కేసు
- సీఎం, డిప్యూటీ సీఎంలను నిందితులుగా చేర్చిన పోలీసులు
- సీఎం సమక్షంలోనే ఐఏఎస్ అధికారిపై దాడి
మూడేళ్ల ‘ఆప్’ పాలనపై రూపొందించిన ప్రచార కార్యక్రమాన్ని విడుదల చేయడం ఎందుకు ఆలస్యమవుతోందంటూ సీఎం తనను ప్రశ్నించారని ప్రకాశ్ పేర్కొన్నారు. ఆ వెంటనే ఎమ్మెల్యేలు అరుస్తూ తనపై దాడి చేశారని అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమాన్ని వెంటనే విడుదల చేయకుంటే రాత్రంతా ఇక్కడే బంధిస్తామని ఓ ఎమ్మెల్యే బెదిరించారని, అమాతుల్లా ఖాన్, ప్రకాశ్ జార్వాల్‌లు తనపై దాడి చేశారని అన్షు ప్రకాశ్ ఆరోపించారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే అమాతుల్లా ఖాన్, ప్రకాశ్ జార్వాల్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు వీకే జైన్‌ను ప్రశ్నించి వదిలిపెట్టారు.