నాకేమీ ఒళ్లు పొగరెక్కి ఇన్ని పెళ్లిళ్లు చేసుకోలేదు..నా కర్మ.. ఏం చేయను!: పవన్ కల్యాణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకేమీ ఒళ్లు పొగరెక్కి ఇన్ని పెళ్లిళ్లు చేసుకోలేదు..నా కర్మ.. ఏం చేయను!: పవన్ కల్యాణ్

  • తన పెళ్లిళ్లపై విమర్శించిన జగన్ కు పవన్ మళ్లీ కౌంటర్
  • మీలా బలాదూరుగా తిరిగే వాడిని కాదు 
  • నాకేమీ ఒళ్లు పొగరెక్కి ఇన్ని పెళ్లిళ్లు చేసుకోలేదు
పవన్ కల్యాణ్ చాలా పెళ్లిళ్లు చేసుకున్నాడని వైసీపీ అధినేత జగన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజాగా మరోసారి స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘మీ అందరితో పోల్చుకుంటే నా వ్యక్తిగత జీవితం చాలా శుభ్రమైంది. మీలాగా నా జీవితాన్ని దాయను. మీరు మెచ్చుకుంటే మెచ్చుకోండి.. చీదరించుకుంటే చీదరించుకో.. నేను దాయను.

నేను బయటకొకటి, లోపలొక మనిషిని కాదు.. ఉదాహరణకు మన నిడదవోలులో రైల్వే ఓవర్ బ్రిడ్జి లేదని నేను అడిగితే.. 'నువ్వు మూడు పెళ్లిళ్లు చేసుకున్నావంటే'!.. ‘నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి ఎందుకు కట్టలేదయ్యా?’ అని అంటే.. ‘పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడయ్యా..’ అంటారా. సరే, ఒక పెళ్లి చేసుకుని మీలాగా బలాదూరుగా తిరిగే వ్యక్తిని కాదు. నా కర్మ, నాకు కుదర్లేదు..ఇలా జరిగింది.. ఏం చేయను దానికి!’ అంటూ పవన్ అన్నారు.

‘మంచో చెడో జరిగింది. నాకేమీ ఒళ్లు పొగరెక్కి చేసుకోలేదు పెళ్లిళ్లు. నాతో ఉండాలంటే ఎవరికైనా కష్టమే. ‘వీడెప్పుడూ (పవన్) బయట వాళ్ల కోసం ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ కేమైంది.. వీళ్ల కేమైంది..అక్కడ రోడ్డు కూలిపోయిందంట’ అని నేను రోజూ ఏడుస్తా ఉంటే పక్కన వాళ్లకు సుఖమేముంటుంది? అందరూ, నన్ను ‘సినిమా యాక్టర్’ అని అనుకుంటారు. ఓ చిన్న గదిలో ఓ మూల కూర్చుని నేను పుస్తకాలు చదువుకుంటూ కూర్చుంటాను. నా జీవితంలో పార్టీలు ఉండవు.. పబ్స్ ఉండవు. ఆవుల దగ్గరో, గేదెల దగ్గరో లేకపోతో ఎవరో ఒకళ్లతో మాట్లాడుతూ ఉంటాడు.. వాడితో (పవన్ తో) సుఖమేముంటుంది? ఎప్పుడూ ఒత్తిడి. అందుకు, నా వ్యక్తిగత జీవితం ఛిన్నాభిన్నమైపోయింది. నేను ఏడ్చాను, ఇబ్బందిపడ్డాను...’ అంటూ పవన్ చెప్పుకొచ్చారు. 
Pawan Kalyan
nidadavolu

More Telugu News