పెళ్లికూతురు అవుతోన్న 'కలర్స్' స్వాతి .. వరుడు పైలెట్!

  • 'కలర్స్' కార్యక్రమంతో మంచి పేరు 
  • కథానాయికగాను యూత్ లో క్రేజ్ 
  • ఈ మధ్యనే తగ్గిన అవకాశాలు  
బుల్లితెరపై ముద్దు ముద్దు మాటలతో 'కలర్స్' ప్రోగ్రామ్ ద్వారా స్వాతి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తరువాత కథానాయికగా ఆమె తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెరపై చిలిపిగా .. చలాకీగా కనిపిస్తూ ఆమె యూత్ ను అలరిస్తూ వస్తోంది. నటనకి అవకాశం ఎక్కువగా వుండే పాత్రలను చేస్తూ మంచి మార్కులు కొట్టేసింది.

ఈ మధ్యనే ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె పెళ్లికి సిద్ధమైందనేది తాజా సమాచారం. పెద్దల అంగీకారంతో ఆమె 'వికాస్' ను ఈ నెల 30వ తేదీన వివాహమాడనున్నట్టు తెలుస్తోంది. వికాస్ తో కొంతకాలంగా వున్న స్నేహం ప్రేమగా మారడం .. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిపోయాయని అంటున్నారు. మలేసియన్ ఎయిర్ లైన్స్ లో వికాస్ పెలైట్ అని చెబుతున్నారు. వివాహం హైదరాబాద్ లో .. రిసెప్షన్ కేరళలో జరగనున్నాయని అంటున్నారు.   
Go Back to Shorts
swathi
vikas

More Telugu News