ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ ఫొటోలు మళ్లీ లీక్... తలలు పట్టుకుంటున్న యూనిట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ ఫొటోలు మళ్లీ లీక్... తలలు పట్టుకుంటున్న యూనిట్!

  • ఆగస్టు 15న సినిమా టీజర్
  • ముందే లీకైన టీజర్ ఫొటోలు
  • యూనిట్‌లోని వారి పనేనని అనుమానం
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్‌లో లీకవడంపై యూనిట్ తలలు పట్టుకుంటోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ను ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. అయితే, అంతలోనే టీజర్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్‌లో హల్ చల్ చేస్తుండడం వారికి తలనొప్పిగా మారింది.

‘అరవింద సమేత’కు సంబంధించిన ఫొటో ఒకటి ఇటీవల కూడా లీకైంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దర్శకుడు త్రివిక్రమ్ ఇకపై షూటింగ్ స్పాట్‌లోకి ఎవరూ ఫోన్లు తీసుకురాకూడదని ఆదేశాలు జారీ చేశాడట. అయినప్పటికీ తాజాగా ఫొటోలు లీకవడం యూనిట్‌ను కలవరపెడుతోంది. విడుదలైన ఫొటోలలో సీన్‌కు సంబంధించిన సమయం కూడా ఉండడంతో యూనిట్‌లోని వారే ఎవరో వీటిని నెట్‌లో పెట్టి ఉంటారని భావిస్తున్నారు. 
NTR
Aravinda sametha
Tollywood
Trivikram
leak

More Telugu News