'ఏక్ బీకే... కోయీ నహీ బికే'... మోదీ సెటైర్!
- రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో హరివంశ్ గెలుపు
- ఇరు పక్షాల్లో ఓ 'హరి' ఉన్నాడన్న ప్రధాని
- ఎవరూ అమ్ముడు పోలేదని వ్యాఖ్య
అంతకుముందు మూజువాణీ ఓటు ద్వారా హరివంశ్ గెలుపును విపక్షాలు అంగీకరించక పోవడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు ఓటింగ్ నిర్వహించడంతో హరివంశ్ కు 125, హరి ప్రసాద్ కు 105 ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై సభలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, సభ తరఫున తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ కు హరివంశ్ సన్నిహితుడని గుర్తు చేసుకున్నారు. విపక్ష నేత గులాంనబీ ఆజాద్ తో పాటు అన్ని పార్టీల నాయకులూ హరివంశ్ కు అభినందనలు తెలిపారు.