రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం రంగంలోకి దిగుతున్న అరుణ్ జైట్లీ.. మూడు నెలల విశ్రాంతి తర్వాత తొలిసారి బయటకు!
- ఎన్డీయే అభ్యర్థి గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ
- సభలో ఎన్డీయేను లీడ్ చేయనున్న జైట్లీ
- తమ మద్దతు ఎన్డీయేకేనన్న నవీన్ పట్నాయక్
మరోవైపు బీజేపీ యేతర, కాంగ్రెస్సేతర పార్టీల నుంచి తమకు మద్దతు లభిస్తుందని బీజేపీ నమ్మకంతో ఉంది. ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ తమ ఓటు ఎన్డీయేకేనని ఇప్పటికే ప్రకటించారు. అయినప్పటికీ ఎన్డీయే అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టుదలగా ఉన్న బీజేపీ జైట్లీని రంగంలోకి దింపక తప్పడం లేదు.