కేంద్ర మంత్రి తరపున మాట్లాడటానికి జీవీఎల్ ఎవరు?: అవంతి శ్రీనివాస్

  • నిన్నటి సమావేశంలో గోయల్ సమాధానం చెప్పలేదు
  • జీవీఎల్ ను చెప్పమన్నారు  
  • రైల్వేజోన్ ఇచ్చేది జీవీఎల్ కాదుగా?
బీజేపీ పార్లమెంట్ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతృత్వంలో ఢిల్లీలోని రైల్‌ భవన్‌లో నిన్న జరిగిన సమావేశంలో రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమాధానం చెప్పకుండా జీవీఎల్ ను సమాధానం చెప్పమన్నారని, మంత్రి తరపున మాట్లాడటానికి జీవీఎల్ ఎవరని ప్రశ్నించారు.

రైల్వేజోన్ ఇచ్చేది జీవీఎల్ కాదని అన్నారు. రైల్వేజోన్ పై నిర్దేశిత సమయం చెప్పాలని సుజనాచౌదరి కోరారని, అందుకు, పీయూష్ గోయల్ వ్యంగ్యంగా మాట్లాడారని అన్నారు. రాష్ట్రానికి పనికొచ్చే విషయాన్ని జీవీఎల్ మాట్లాడాలని, ఆంధ్రులంటే అంత లోకువా, అడుక్కోవాలా? అని అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు.
Go Back to Shorts
Telugudesam
avanthi

More Telugu News