ఇది క్రికెట్ టూరా? లేక హానీమూన్ టూరా?: అనుష్క శర్మ, బీసీసీఐలపై నెటిజన్ల ఫైర్
- లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని సందర్శించిన టీమిండియా ఆటగాళ్లు
- వారితో పాటే అక్కడకు వెళ్లిన అనుష్క శర్మ
- ఫొటోను షేర్ చేసిన బీసీసీఐ
ఈ ఫొటోపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. టీమిండియాలో అనుష్క కూడా ఉందా? టీమ్ తో కలసి అనుష్క ఎందుకుంది? ఇది క్రికెట్ టూరా? లేక హనీమూన్ టూరా? అంటూ నెటిజన్లు బీసీసీఐ, అనుష్కలపై మండిపడుతున్నారు. మరోవైపు, భారత్-ఇంగ్లండ్ ల మధ్య రెండో టెస్టు రేపు ప్రారంభంకానుంది. తొలి టెస్టులో ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.