వంట బాగా చేయాలని భార్యను కోరడం తప్పేమీ కాదు: బాంబే హైకోర్టు కీలక రూలింగ్
- 17 ఏళ్ల నాటి మహిళ ఆత్మహత్య కేసులో కోర్టు తీర్పు
- నిందితులది తప్పున్నట్టు కనిపించడం లేదన్న న్యాయస్థానం
- ఇంటి పని చేయాలనడాన్ని వేధింపులుగా భావించలేమన్న న్యాయమూర్తి
"వంట సరిగ్గా చేయమని కోరడం, సక్రమంగా ఇంటి పని చేసుకోవాలని చెప్పడం వంటివి తప్పు కాదు. అదేమీ వేధింపులుగా భావించలేము. ఈ కేసులో అంతకు మించిన సాక్ష్యాలు నిందితులపై లేవు. ఐపీసీలోని సూసైడ్ సెక్షన్ల ప్రకారం కూడా వీరిని దోషులుగా పేర్కొనలేము" అని వ్యాఖ్యానించిన జస్టిస్ సరంగ్ కొత్వాల్, నిందితుడిపై వచ్చిన వివాహేతర బంధంపైనా ఆధారాలను ప్రాసిక్యూషన్ చూపించలేదని అభిప్రాయపడ్డారు.