విశాఖ కైలాసగిరిపై అదుపు తప్పిన బ్యాటరీ కారు... మహిళ మృతి!

  • నగర సందర్శనకు వచ్చిన బెంగళూరు వాసులు
  • శివపార్వతుల విగ్రహాల వద్ద కారు బ్రేకులు ఫెయిల్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజ్యలక్ష్మి మృతి
విశాఖపట్నంలో నిత్యమూ పర్యాటకులతో కిటకిటలాడే కైలాసగిరి ప్రాంతంలో ప్రమాదం జరిగింది. పర్యాటకులను తీసుకెళ్లే ఓ బ్యాటరీ కారు అదుపుతప్పి బెంగళూరుకు చెందిన కె.రాజ్యలక్ష్మి (37) అనే మహిళ మరణించింది. తన బంధుమిత్రులతో కలసి విశాఖ సందర్శనకు వచ్చిన రాజ్యలక్ష్మి, తెలుగు మ్యూజియం సందర్శించారు.

ఆపై అక్కడి బ్యాటరీ కారు ఎక్కి శివపార్వతుల విగ్రహాలవైపు వెళ్లారు. ఆ సమయంలో కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్, దాన్ని అదుపు చేయాలని ప్రయత్నించి విఫలం అయ్యాడు. అంతలోనే ఆ కారు వేగంగా వెళ్లి, బస్టాప్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజ్యలక్ష్మికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.
Go Back to Shorts
Vizag
Kailasagiri
Battery Car

More Telugu News