రష్మిక మందన ఎంగేజ్ మెంట్ రద్దు కాలేదట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రష్మిక మందన ఎంగేజ్ మెంట్ రద్దు కాలేదట!

  • రష్మిక మందనకు మంచి క్రేజ్ 
  • పెరుగుతోన్న అవకాశాలు
  • పుకార్లపై స్పందించిన పీఆర్వో              
తెలుగు .. కన్నడ భాషల్లో ఇప్పుడు రష్మిక మందన పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దర్శక నిర్మాతలు .. యువ హీరోలు చాలామంది తమ సినిమాల్లో ఆమెను తీసుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. అవకాశాల జోరు పెరుగుతోన్న సమయంలో ఆమె ఎంగేజ్ మెంట్ గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ మధ్య రష్మిక మందనకు .. రక్షిత్ శెట్టితో ఎంగేజ్ మెంట్ జరిగింది. కొన్ని కారణాల వలన ఈ ఎంగేజ్ మెంట్ రద్దయిందనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. ఈ విషయంపై తాజాగా రష్మిక మందన పీఆర్వో స్పందించారు. రష్మిక .. రక్షిత్ శెట్టి ఎంగేజ్ మెంట్ బ్రేకప్ అయిందనే వార్తలో ఎంతమాత్రం నిజం లేదు. వాళ్లిద్దరి మధ్య లవ్ బాండ్ చాలా బలమైనది .. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఇద్దరూ ఎప్పటిలానే కలిసి ఫంక్షన్స్ కి వెళుతున్నారు. వాళ్లిద్దరి ఎంగేజ్ మెంట్ రద్దయిందనే వార్తలను నమ్మవద్దు" అని ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు.            
rashmika
rakshith shetty

More Telugu News