70 ఏళ్ల వృద్ధురాలిగా .. ప్రధానమైన పాత్రలో సమంత?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

70 ఏళ్ల వృద్ధురాలిగా .. ప్రధానమైన పాత్రలో సమంత?

  • అతీత శక్తులు కలిగిన వృద్ధురాలు 
  • అవసరమైనప్పుడు యవ్వనవతిగా మారడం 
  • కొరియన్ మూవీకి రీమేక్  
విభిన్నమైన కథలను .. పాత్రలను ఎంచుకుంటూ సమంత వరుస విజయాలను అందుకుంటోంది. గ్లామర్ తో పాటు నటనకి ఎక్కువగా అవకాశం వుండే పాత్రలను అంగీకరిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. అలాంటి సమంత మరో వైవిధ్యభరితమైన కథాంశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

దర్శకురాలు నందినీ రెడ్డి .. సమంతకు మధ్య కొన్ని రోజులుగా కథా చర్చలు జరుగుతున్నాయట. ఇది 2014లో వచ్చిన కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి రీమేక్ అని అంటున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపిస్తూ ఉంటుంది. అతీత శక్తులను కలిగిన ఆమె అవసరమైనప్పుడు యవ్వనవతిగా మారిపోతూ ఉంటుంది. అలాంటి పాత్రలో సమంతను చూపించాలనే ఉద్దేశంతోనే నందినీ రెడ్డి ఉన్నారట. కొత్తదనంతో కూడిన పాత్రలనే ఎక్కువగా చేస్తానని ఇటీవలే చెప్పిన సమంత, ఈ సినిమా చేసే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
samantha

More Telugu News