మందుబాబులకు కొత్త కిక్.. జీహెచ్ఎంసీ పరిధి బార్లలో ఇక రాత్రి ఒంటి గంట వరకు మందేయొచ్చు!
- బార్ల సమయాన్ని మరో గంట పెంచిన ప్రభుత్వం
- రాత్రి ఒంటి గంట వరకు పొడిగింపు
- శుక్ర, శనివారాలు మాత్రమే
వారాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో రాత్రి సమయాన్ని మరో గంట పెంచాలని బార్ల యజమానుల సంఘం ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. దీంతో స్పందించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, శుక్ర, శనివారాలు మినహా మిగతా రోజుల్లో పాత సమయాలనే పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లను తెరిచిపెట్టుకునే అవకాశం ఉంది.