ఏపీకి 18, తెలంగాణకు 9... దేశవ్యాప్తంగా 200 కొత్త రైల్వే లైన్లు!
- లోక్ సభలో నేడు వెల్లడించిన రైల్వే శాఖ
- కొన్ని అనుమతుల వల్ల ప్రాజెక్టుల ఆలస్యం
- చట్టపరమైన అడ్డంకులను అధిగమిస్తున్నామన్న మంత్రి
కొత్త రైల్వే లైన్లలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలకు 15, ఆంధ్రప్రదేశ్ కు 18, బీహార్ కు 34, ఛత్తీస్ గఢ్ కు 8, ఢిల్లీకి 1, గుజరాత్ కు 4, హర్యానాకు 7, హిమాచల్ ప్రదేశ్ కు 4, జమ్ము కశ్మీర్ కు 1, జార్ఖండ్ కు 14, కర్ణాటకకు 16, కేరళకు 2, మధ్యప్రదేశ్ కు 8, మహారాష్ట్రకు 12, ఒడిశాకు 10, పంజాబ్ కు 6, రాజస్థాన్ కు 10, తెలంగాణకు 9, తమిళనాడుకు 8, ఉత్తర ప్రదేశ్ కు 15, ఉత్తరాఖండ్ కు 3, పశ్చిమ బెంగాల్ కు 18 నూతన లైన్లు రానున్నాయని ఆయన వెల్లడించారు.
గత ఆర్థిక సంవత్సరంలో స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా 21 హరిత రైల్వే కారిడార్ లను ఏర్పాటు చేశామని, ఈ లైన్లలో ప్రయాణించే పలు రైళ్లలో బయో టాయిలెట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. అంతకుముందు సంవత్సరంలో 7 గ్రీన్ కారిడార్ లను ఏర్పాటు చేశామని, మానవ విసర్జితాలు రైలు పట్టాలపై పడకుండా చర్యలు చేపట్టామని గోహెన్ వెల్లడించారు.