సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మంచి ఫీడ్ బ్యాక్ వస్తుందంటున్న రకుల్
  • తాజా ఆఫర్ ను తిరస్కరించిన కృష్ణ 
  • దేవదాస్ కి సీక్వెల్ చేస్తానంటున్న నాగార్జున 
  • దర్శకుడిగా మారుతున్న సంగీత దర్శకుడు 
*  తన సినిమాల గురించి తనకు మంచి ఫీడ్ బ్యాక్ వస్తుందని చెబుతోంది అందాలభామ రకుల్ ప్రీత్ సింగ్. 'మా ఇంట్లో వాళ్లు కానీ, నా స్నేహితులు కానీ నా సినిమాలు చూసి మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. బాగుంటే బాగుందని, లేకపోతే లేదని చెప్పేస్తారు. అలాంటి ఫీడ్ బ్యాకే నాకు బాగా ఉపయోగపడుతుంది కదా? నా నటనలో లోపాలుంటే కనుక సవరించుకోవడానికి నాకు ఎంతో హెల్ప్ అవుతుంది' అని చెప్పింది రకుల్.
*  ఇప్పటికి సుమారు 350 చిత్రాలలో నటించిన సూపర్ స్టార్ కృష్ణ తాజాగా ఓ చిత్రంలో వచ్చిన ఆఫర్ కి 'నో' చెప్పారు. అడవి శేష్ హీరోగా రూపొందిన 'గూఢచారి' చిత్రంలో ఓ చిన్న స్పెషల్ క్యారెక్టర్ పోషించాల్సిందిగా యూనిట్ వారు కోరారట. అయితే, తాను నటన నుంచి బ్రేక్ తీసుకున్నానని చెప్పి, ఆ ఆఫర్ ను కృష్ణ సున్నితంగా తిరస్కరించినట్టు అడవి శేష్ తెలిపాడు.
*  ప్రస్తుతం నానితో కలసి నాగార్జున 'దేవదాస్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా నాగార్జున చెబుతూ, ఈ చిత్రం హిట్టయితే కనుక మళ్లీ నానితో కలసి దీనికి సీక్వెల్ గా 'దేవదాస్ 2' చేస్తానని తెలిపారు. అలాగే 'సోగ్గాడే చిన్ని నాయనా' సీక్వెల్ కూడా త్వరలో ఉంటుందని చెప్పారు.
*  ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా త్వరలో దర్శకుడిగా మారనున్నాడు. దీని గురించి యువన్ చెబుతూ, 'అవును, త్వరలో దర్శకత్వం చేయబోతున్నాను. ప్రస్తుతం స్క్రిప్ట్ పని చేసుకుంటున్నాను' అని చెప్పాడు. తాజాగా ఈయన నిర్మాతగా మారి 'ప్యార్ ప్రేమ కాదల్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
Rakul
Krishna
Nagarjuna
Nani

More Telugu News