దేశం విడిచి వెళ్లకపోతే రోహింగ్యా ముస్లింలను కాల్చి చంపండి: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

భారత్ లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలు దేశం విడిచి వెళ్లకపోతే వారిని కాల్చి చంపాలంటూ హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. రోహింగ్యా ముస్లింలను వాళ్ల దేశాలకు వెంటనే పంపించి వేయాలని చెప్పారు. అత్యంత ప్రమాదకరమైన వారిని మన దేశంలో ఉంచుకోవడం హానికరమని అన్నారు. వారు రోహింగ్యాలైనా లేదా బాంగ్లాదేశీలైనా ఎవరైన సరే... వారిని దేశం నుంచి తరిమి వేయాలని కేంద్రాన్ని కోరుతున్నానని చెప్పారు. మన దేశాన్ని విడిచి వెళ్లేందుకు వారు అంగీకరించకపోతే కాల్చి చంపాలని అన్నారు.

హైదరాబాదులో కూడా భారీ సంఖ్యలో రోహింగ్యా ముస్లింలు అక్రమంగా నివసిస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. ముఖ్యంగా పాతబస్తీలోని ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వీరు ఎక్కువగా నివసిస్తున్నారని చెప్పారు. రోహింగ్యాలకు ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆర్థికంగా సాయం చేస్తున్నారని ఆరోపించారు. రోహింగ్యా ముస్లింలంతా టెర్రరిస్టులకు అనుకూలంగా ఉంటారని చెప్పారు. భారతదేశం, తెలంగాణ సురక్షితంగా ఉండాలంటే... కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ముఖ్యమంత్రి కేసీఆర్ లు ... వీరిని దేశం నుంచి తరిమికొట్టాలని కోరారు. ఒకవేళ ఆ పనిని చేయకపోతే... దేశానికి వీరు ప్రమాదకరంగా మారుతారని చెప్పారు. 
Go Back to Shorts
raja singh
rohingya muslims
kcr
rajnath singh

More Telugu News