మొసలితో షాపులోకొచ్చిన యువకుడు.. భయంతో పరుగులు తీసిన కస్టమర్లు!

  • అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన
  • విచారణకు అధికారుల ఆదేశం
  • నేరం రుజువైతే భారీ శిక్ష
పుర్రకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటే ఇదే. ప్రజల్ని హడలెత్తించాలనుకున్న ఓ యువకుడు ఏకంగా ప్రాణాలతో ఉన్న మొసలిని షాపులోకి తీసుకొచ్చాడు. దీంతో జంతు సంరక్షణ అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.

ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లేలో ఆదివారం ఓ వ్యక్తి ప్రాణాలతో ఉన్న మొసలిని చేత్తో పట్టుకుని షాపులోకి ప్రవేశించాడు. దానిని చూసిన కస్టమర్లు భయపడ్డారు. దీంతో సదరు వ్యక్తి వారివైపు మొసలిని తీసుకుని పరిగెత్తాడు. చివరికి బీర్ టిన్ ను తీసుకుని షాపు నుంచి వెళ్లిపోయాడు. ఈ సమయంలో మొసలి నోటికి టేప్ వేసి ఉంది.

ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో జంతు సంరక్షణ అధికారులు స్పందించారు. ఫ్లోరిడా చట్టాల ప్రకారం అనుమతి లేకుండా మొసలిని కలిగి ఉండటం తీవ్రమైన నేరమని తెలిపారు. మొసలి లాంటి జంతువులు ఎలాంటి ఒత్తిడిని తట్టుకోలేవనీ, అలాంటి పరిస్థితులు ఎదురైతే ఇవి చనిపోతాయని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఘటనలో నేరం రుజువైతే సదరు వ్యక్తికి 4 నుంచి 12 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Go Back to Shorts
Florida
alligator
USA

More Telugu News