బిగ్ బాస్-2... రీఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు, శ్యామల!

30-07-2018 Mon 08:29 | Entertainment
  • నూతన్ నాయుడికి అత్యధిక ఓట్లు
  • స్వల్ప తేడాతో నిలిచిన శ్యామల
  • ఇద్దరికీ హౌస్ లో రీ ఎంట్రీకి అవకాశం ఇచ్చిన నాని 
తెలుగు టీవీ ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్-2లో అందరూ అనుకున్నట్టుగానే నూతన్ నాయుడు, శ్యామల రీఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని ముందే లీకైపోయిన సంగతి తెలిసిందే. సామాన్యుడి కోటాలో హౌస్ లోకి వెళ్లిన నూతన్ నాయుడు, రెండు వారాల తరువాత బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, హౌస్ లోకి రీ ఎంట్రీ ప్రకటించిన తరువాత గత వారం రోజులుగా ఓట్ల కోసం ప్రచారం జరిగింది. బిగ్ బాస్ హిస్టరీలో ఎన్నడూ రాని విధంగా ఓట్ల వర్షం కురిసింది. నూతన్ నాయుడికి శ్యామల కన్నా కాసిన్ని ఓట్లు అధికంగా వచ్చాయి. దీంతో ఈ ఇద్దరూ హౌస్ లోనికి వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు హోస్ట్ నాని ప్రకటించాడు.

ఇక వీరిద్దరి రీ ఎంట్రీ ఎపిసోడ్ ను శనివారం నాడే షూట్ చేయడంతో, ఆ షోలో ప్రేక్షకులుగా కూర్చున్న వారు బయటకు వచ్చి లీకులిచ్చేశారు. తాను ప్రేక్షకుల వల్ల ఎలిమినేట్ కాలేదని, హౌస్ మేట్స్ తనను ఎలిమినేట్ చేశారన్న విషయాన్ని శ్యామల అభిమానుల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించింది. ఇదే సమయంలో కౌశల్ ఆర్మీ నూతన్ నాయుడికి మద్దతు పలికింది. ఈ కారణాలతోనే మిగతా వారితో పోలిస్తే వీరిద్దరికీ అధికంగా ఓట్లు వచ్చాయని తెలుస్తోంది.

ఇదిలావుండగా, హోస్ట్ నాని ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడని కామెంట్స్ వస్తున్నాయి. కౌశల్ కు మద్దతుగా నాని వ్యవహరిస్తున్నాడని, హౌస్ లో గొడవలపై స్పష్టత ఇవ్వలేకపోతున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.
BiggbossSeason-2NaniNutan NayuduSyamalaRe entry

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more