పెళ్లి వార్తలని ఖండించిన తమన్నా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి వార్తలని ఖండించిన తమన్నా!

  • నేను పెళ్లి చేసుకోబోతున్నాననే వార్తల్లో నిజం లేదు
  • ఈ పుకార్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు
  • పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు.. అందరికీ చెప్పే చేసుకుంటా
మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై స్పందించిన తమన్నా... ఇవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని ట్విట్టర్ ద్వారా తెలిపింది.

"ఒక రోజు యాక్టర్, మరొక రోజు క్రికెటర్, ఇంకొక రోజు డాక్టర్. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని పెళ్లి చేసుకోబోతున్నానంటూ రూమర్లను ప్రచారం చేస్తున్నారు. భర్తను వెతుక్కునే పనిలో నేను చాలా బిజీగా ఉన్నాననే భావనను కలిగింపజేస్తున్నారు. నా జీవితానికి సంబంధించి ఎలాంటి అసత్య ప్రచారాలను నేను అంగీకరించను. ప్రస్తుతానికి సింగిల్ గా నేను చాలా సంతోషంగా ఉన్నా. నా తల్లిదండ్రులు కూడా అల్లుడిని వెతికే పనిలో లేరు. ప్రస్తుతం సినిమాలతోనే నేను ప్రేమలో ఉన్నా.

ఒకవైపు నేను సినిమాలతో బిజీగా ఉంటే... ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు. ఇలాంటి తప్పుడు వార్తలు ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగిస్తాయి. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే... ఆ విషయాన్ని అందరితో పంచుకుంటా. ఇందులో దాచి పెట్టాల్సింది ఏమీ లేదు. ఇప్పట్లో నేను పెళ్లి చేసుకోవడం లేదనే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నా. ఇలాంటి అసత్య ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టండి... ప్లీజ్" అంటూ తమన్నా ట్వీట్ చేసింది.
Tamannaah
marriage
tollywood

More Telugu News