ప్రధాని, గవర్నర్ల నివాసాలను హోటళ్లుగా మార్చేస్తా: తొలి ప్రసంగంలోనే ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు
- నేనో చిన్న ఇంటిలో ఉంటా
- ప్రధాని నివాసంలో ఉండడం అవమానకరం
- భారత్ ఒక అడుగు ముందుకేస్తే.. నేను రెండడుగులు వేస్తా
ప్రధాని పదవిని అధిష్ఠించాక తానో చిన్న ఇంటిలో ఉంటానని పేర్కొన్న ఇమ్రాన్ దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని నివారిస్తానని, ఇకపై ప్రజల కోసం ఖర్చు చేస్తానని అన్నారు. భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు కృషి చేస్తానని పేర్కొన్న ఇమ్రాన్.. ఈ విషయంలో భారత్ ఒక అడుగు ముందుకేస్తే తాను రెండడుగులు వేస్తానని స్పష్టం చేశారు.