రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నా.. వయసువల్ల కావచ్చు!: కేటీఆర్
- 42వ పుట్టినరోజును జరుపుకుంటున్న కేటీఆర్
- ఆదివారం నుంచి జ్వరంతో బాధపడుతున్న వైనం
- కేక్ కట్ చేసే బదులు మొక్క నాటాలంటూ పిలుపు
ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా కేటీఆర్ స్పందిస్తూ, జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మిమ్మల్ని కలసి పేరుపేరునా ధన్యవాదాలను చెప్పాలని ఉందని... కానీ ఆదివారం నుంచి తాను జ్వరంతో బాధపడుతున్నానని... బహుశా వయసు రీత్యా అయి ఉండవచ్చని చెప్పారు.